logo

GVMC అధికారులు మోంథా తుఫాన్ యుద్ధ ప్రాతిపదికన పనులు..

విశాఖపట్నం (గాజువాక)

జీవీఎంసీ జోన్ - 6 పరిధిలో మోంథా తుఫాన్ ప్రభావం వలన లోతట్టు ప్రాంతమైన 76వ వార్డు బర్మా కాలనీ,రిక్షా కాలనీ,స్వతంత్ర నగర్,హౌసింగ్ బోర్డ్ కాలనీలో నీరు నిలవకుండా ప్రవహించే విధంగా పూడిక పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్న జీవీఎంసీ అధికారులు.జీవీఎంసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గాజువాక పైనుంచి ప్రధాన కాలువ మార్గంలో గంగవరం పోర్టు గేటు సమీపము నుంచి సముద్ర మార్గంలో గడ్డలు,కాలువలు యుద్ధ ప్రాతిపదికన నీరు ప్రవహించే విధంగా చర్యలు చేపడుతున్నారు.జీవీఎంసీ సానిటరీ సిబ్బందితో,యంత్ర సహాయంతోను (జెసిబి, ప్రోక్లైన్ ) చెత్తను తొలగించి నీరు ప్రవహించే విధంగా చేస్తున్నారు.డాక్టర్ కిరణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవీఎంసీ కమిషనర్,విశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతం మునిగే విధంగా ఉండకూడదని ఆదేశించారు.ఈ మేరకు చెత్తను తీయడం ద్వారా నీటి ప్రవాహం సముద్రంలో కలవటంతో ఈ యొక్క మార్గం వలన లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం లేకుండా చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు,సానిటరీ ఇన్స్పెక్టర్ తాతారావు,సూపర్వైజర్, సానిటరీ వర్కర్స్, పాల్గొని ఈ యొక్క పూడికలు తొలగిస్తున్న వైనం.

25
479 views