రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ఆళ్లగడ్డ డి.ఎస్.పి
AIMA న్యూస్.నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్IPS ఆదేశాలమేరకు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ డి.ఎస్.పి K.ప్రమోద్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముందుగా ఆళ్లగడ్డ డిఎస్పిK.ప్రమోద్ రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు, అనంతరం ఆళ్లగడ్డ పట్టణ సీఐ యుగంధర్ , ఎస్సైలు నగీన, జయప్ప సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది మొత్తం 27 మంది, ఇతర ప్రజలు వికలాంగులు,యువత,మహిళలు ,79 మంది మొత్తంగా 106 మంది రక్తదానం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన స్టేట్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బందికి, ప్రజలకు, ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ సిబ్బంది అందరికీ డీయస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు.