అరకు: నిపుణుల కమిటీ సమావేశాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్దం
అల్లూరి జిల్లా కలెక్టర్ ఆఫీసులో సోమవారం జరిగిన హైడ్రో పవర్ ప్రాజెక్టు నిపుణుల కమిటీ సమావేశాన్ని ఖండిస్తున్నామని ఆదివాసీ గిరిజన సంఘం పేర్కొంది. ఈ మేరకు అరకులోయ మండలం బస్కీ దేవరాపల్లిలో ఆదివాసీలు దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు లు వద్దని పోరాడుతుంటే జిల్లా అధికార యంత్రాంగం ఆ ప్రాజెక్టుల డీపీఆర్ కొరకు నిపుణలతో సమావేశం నిర్వహించడం ఏంటని ఆ సంఘం జిల్లా కార్యదర్శి బాలదేవ్ ప్రశ్నించారు.