logo

మొంథా తుఫాను ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : పొద్దు బాలదేవ్

ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన వచ్చే మొంథా తుఫాను తో రాబోయే మూడు రోజులల్లో అల్లూరి జిల్లలో భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ పిలుపునించారు. ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కావున ప్రజలు చెట్ల క్రింద, అడవులలోనూ, కాఫీ తోటలులోను ఉండకూడదని బాలదేవ్ పేర్కొన్నారు. పిల్లలు వాగుల వద్దకు, చెరువుల వద్దకు వెళ్ళవద్దని, ప్రజలు వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని, కరెంట్ స్తంబాలు పట్టుకోవద్దని సూచించారు. ఈ మూడు రోజులు పశువులను అడవికి మేతకు తీసుకువెళ్లకుండా ఇంటి వద్ద ఉన్న తౌడు ఉడకబెట్టి మరియు అందుబాటులో ఉన్న మేతను వేయాలని సూచించారు. ప్రజలు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని బాలదేవ్ కోరారు. అత్యవసర పరిస్థితులలో పొలీస్ వారికి కాని సంబందిత శాఖ అధికారులకు కాని తెలపాలని పేర్కొన్నారు. వర్షాలు వలన కాని, గాలుల వలన కాని ప్రమాదాలు జరిగితే కంట్రోల్ మరియు కమాండ్ కోసం 7780292811 నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు. రోడ్లకు అడ్డంగా చెట్లు పడినా, రాకపోకలు నిలిచిపోయినా ఫోన్ చేయవచ్చని తెలిపారు.

2
209 views