logo

ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ , బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ .


తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ , ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ కలిసి టీవీ9 కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు.
ఈ సందర్భంగా వారు ఆటో డ్రైవర్ల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏవీ అమలు చేయలేదని, ఆటో డ్రైవర్లకు తీవ్రమైన మోసం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ, “ఇంటి కిరాయిలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక, ఆటో కిస్తీలు కట్టలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం” అని వాపోయారు. ఆటో రుణాలు, పెట్రోల్ ధరలు, ఇన్సూరెన్స్ చార్జీల భారం కారణంగా జీవనోపాధి కష్టమైందని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

27
130 views