logo

గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, కాకినాడ వారి ఆదేశములు:



కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, కాకినాడ వారి ఆదేశాల మేరకు రానున్న అతి భారీ తుఫాను ప్రభావ రీత్యా కాకినాడ జిల్లాలో గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలకు ది 27.10.2025 నుండి 31.10.2025 వరకు సెలవు ప్రకటించబడినది.

ఎట్టి పరిస్థితులలోనూ తదుపరి సమాచారం ఇచ్చేవరకు ఏ పాఠశాలలను నిర్వహించ రాదు.

ఉప విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు పాఠశాల యొక్క రికార్డులన్నీ సురక్షితంగా ఉండే విధంగా తగు ఏర్పాట్లు చేసుకోవలెను మరియు రెవెన్యూ అధికారులకు అందుబాటులో ఉండి వారు తుఫాను పునరావాస కేంద్రం నిర్వహణ నిమిత్తము పాఠశాల ఆవరణ కోరినట్లయితే వారికి పాఠశాల తాళాలను అప్పగించవలసిందిగా ఆదేశించడమైనది.

తుఫాను రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ పాఠశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని తెలియపరచవలెను.

ఉప విద్యాశాఖ అధికారులు మరియు మండల విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి వారి అత్యవసర ఆదేశముల కొరకు నిరంతరం అందుబాటులో ఉండవలసిందిగా ఆదేశించడమైనది.

ఈ విషయమై ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, కాకినాడ వారు ఆదేశించడమైనది.

జిల్లా విద్యాశాఖాధికారి,
కాకినాడ.

17
1057 views