logo

శ్యాంపురంలో సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు, పల్లె నిద్ర


, అక్టోబర్ 27:
రాజాం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ ఆదివారం రాత్రి శ్యామ్‌పురం గ్రామంలో ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ వ్యతిరేక చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. తెలియని లింకులు క్లిక్ చేయకూడదు, బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వకూడదు. చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలకు దారి తీస్తాయి” అని హెచ్చరించారు. అలాగే యువతలో డ్రగ్స్ అలవాటుపై జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ఇంకా రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని, హెల్మెట్‌లు, సీటు బెల్ట్‌లు తప్పనిసరిగా వాడాలని సూచించారు. “ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. క్షణిక నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుంది” అని ఆయన అన్నారు.

సమావేశం ముగిసిన అనంతరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ గ్రామ సచివాలయంలో ‘పల్లెనిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజల సమస్యలను వినిపించారు.

గ్రామ ప్రజలు పోలీస్ అధికారుల ఈ పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ – “మా గ్రామానికి స్వయంగా వచ్చి సమస్యలు విన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారికి ధన్యవాదాలు” అన్నారు.

86
4041 views