logo

మయన్మార్ నుంచి ఢిల్లీకి ఓ విమానం వచ్చింది. అందులోని ప్రయాణీకులు ఒక్కొక్కరిగా ఎయిర్‌పోర్టులోకి ఎంటర్ అవుతున్నారు. ఈలోపు ఓ మహిళ

మయన్మార్ నుంచి ఢిల్లీకి ఓ విమానం వచ్చింది. అందులోని ప్రయాణీకులు ఒక్కొక్కరిగా ఎయిర్‌పోర్టులోకి ఎంటర్ అవుతున్నారు. ఈలోపు ఓ మహిళ కదలికలపై అధికారులకు అనుమానమొచ్చింది. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగిందంటే.? ఆ వివరాలు ఇలా. ఓ సారి లుక్కేయండి మరి

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం అక్రమ రవాణాను గుట్టురట్టు చేశారు కస్టమ్స్ అధికారులు. మార్కెట్‌లో లక్షలు విలువ చేసే సుమారు 997.5 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మయన్మార్‌లోని యాంగోన్ నుంచి 8M620 విమానం ఢిల్లీకి వచ్చింది. ఈ విమానంలో ఢిల్లీకి వచ్చిన మహిళ నుంచి సుమారు కేజీ బంగారాన్ని గుర్తించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా బయటకు వెళ్తుండగా.. ఆమెను ఆపి చెక్ చేశారు అధికారులు. సదరు మహిళ కదలికలపై అనుమానపడ్డ అధికారులు.. క్షుణ్ణంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆమె ఈ బంగారాన్ని తన లోదుస్తుల్లో దాచిపెట్టినది. ఆమె నుంచి ఆరు బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని జప్తు చేసి.. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

9
328 views