logo

తుఫాను పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి


మోంథా' తుఫాన్ అక్టోబర్ 28న సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో, మచిలీపట్నం మరియు కలింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసినందున తుఫాన్ తీరం దాటి సమయంలో గంటకు 90-100 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్, విజయనగరం వారి ఈ క్రింద అంశములు పై హెచ్చరికలు మరియు అప్రమత్తత గురించి ఆదేశాలు జారీ చేసియున్నారు.

> మత్స్యకారులు అక్టోబర్ 25 నుంచి 28 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆదేశించియున్నారు.

> ప్రజలు అందరూ కూడా అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ఎటువంటి దూర ప్రయాణాలు చేయరాదని తెలిపియున్నారు.

> కార్తీక స్నానాలు చేయడానికి ప్రజలు ఎవరు కూడా నదులు, చెరువులు మరియు కాలువాలు వద్దకు వెళ్లరాదని తెలిపియున్నారు.

> ప్రజలు అందరు కూడా సురక్షిత ప్రాంతాలలో నివాసం ఉండాలని తెలిపియున్నారు.

> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాన్ ప్రభావంతో ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారుల మరియు జోనల్ ఇంఛార్జీలు నియామకం చేసియున్నారని తెలిపియున్నారు.

'మోంథా' తుఫాన్ కారణంగా తహశిల్దార్ వారి కార్యాలయం, రాజం నందు తేది.26.10.2025 నుండి 30.10.2025 వరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిననందున మరియు గ్రామా రెవిన్యూ అధికార్లు అందరూ కూడా 24 గంటలు గ్రామాలలో అందుబాటులో ఉంటారని, కావున ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా వుండి తుఫాన్ కారణంగా గ్రామాలలో ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టం మరియు అవాంచనీయ ఘటనలు జరగిన వెంటనే తహశిల్దార్ వారి కార్యాలయమునకు తెలియజేయాలని తాసిల్దార్ రాజశేఖర్ తెలిపారు.

115
5034 views