logo

రామభద్రపురంలో తగలబడ్డ వ్యాను

రామభద్రపురం పొట్టావాని కోనేరు వద్ద శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాచిపెంటకు చెందిన అప్పలనాయుడు తన బైకుపై బాడంగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లగేజీ వ్యాను బలంగా ఢీకొట్టడంతో బైకుపై ఉన్న అప్పలనాయుడు ఎగిరి రోడ్డు ప్రక్క పడిపోయాడు. బైకు మాత్రం వ్యాను క్రింద ఇరుక్కుపోయి రోడ్డును బలంగా రాసుకోవడంతో క్షణాల్లో వ్యానులో మంటలు చెలరేగాయి. వ్యాను డ్రైవర్‌ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.

0
99 views