logo

ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ నాయకు లను ఘనంగా సన్మానించిన మొండితోక జగన్మోహనరావు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ అక్టోబర్26 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

నందిగామ జిల్లా పార్టీ అనుబంధ విభాగాల్లో పదవులు పొందిన పలువురు నాయకుల ను మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన రావు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కొండా పద్మరెడ్డి, ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రాఘవరపు వినాయకరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జగన్మోహన రావు వారిని అభినందించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ పటిష్టత కోసం చేపట్టవలసిన కార్యక్రమా లపై నాయకులతో చర్చించారు.
ఈ సందర్భంగా నాయకులు కూడా తమ విభాగాల ద్వారా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

0
0 views