శ్రీ వైఖానస ఆగమ శాస్త్ర విధానంలో పవిత్రోత్సవాలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ అక్టోబర్26 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 2025 నవంబర్ 14 నుండి 17 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించబడనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా పాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమంఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్. నరసింహ మూర్తి, ఆలయ అర్చకులు దీవి వెంకటరత్మామార్యులు పాల్గొని,
"స్వామివారి పవిత్రోత్సవాలు ఘనంగా, ఆచార వ్యవహారా లతో, వైభవంగా జరుగనున్నా యి. భక్తులు అందరూ పాల్గొని ఈ దివ్యోత్సవాలకు సహాయ సహకారాలు అందించవలసిం దిగా కోరుతున్నాం" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏచూరి రామకృష్ణ, తొర్లికొండ సీతారామయ్య, ఊటుకూరు వెంకట సత్యనారాయణ గుప్తా, మహంకాళి వెంకన్న, పారేపల్లి చిన్నారి, వెంకటేశ్వరరావు, రమణ, బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు.