logo

డా.కోమ్మోజు రమేష్ కు భారత్ ఎడ్యుకేషనల్ ఎక్స్లెన్స్- 2025 జాతీయ అవార్డు

శ్రీ వైష్ణవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ డా.కోమ్మోజు రమేష్, 2025 భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (BEEA 2025) లో గౌరవనీయంగా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ ఎక్కువగా ఎన్రోల్ కాగా వారిలో 200 మందికి మాత్రమే ఈ గౌరవం దక్కింది దాంట్లో భాగంగా డా.కోమ్మోజు రమేష్ గత 22 ఏళ్లగా వివిధ హోదాల్లో విద్యా రంగంలో చూపిన అద్భుతమైన కృషి, నిబద్ధత మరియు ఆవిష్కరణకు గుర్తింపు లభించింది.

BEEA 2025 అవార్డు ఫైనల్ స్టేజ్ ఘనోత్సవం శనివారం, 25 అక్టోబర్ 2025, హైదరాబాద్ T-Hub వేదికగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్, చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, AICTE – విద్యా శాఖ, భారత ప్రభుత్వం & సీఈఓ మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు , ప్రభుత్వ, పరిశ్రమల ప్రముఖులు చేతుల మీదగా డా.కోమ్మోజు రమేష్ ఈ జాతీయ అవార్డు ను అందుకున్నారు.
రమేష్ ఈ గౌరవనీయ అవార్డు ద్వారా తమ విద్యా రంగంలో నిబద్ధత, ఆవిష్కరణ మరియు నాయకత్వ ప్రతిభను మరొకసారి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా విద్యా నిపుణులు, నాయకులు, మరియు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గతంలో దీర్ఘకాలం పనిచేసిన విద్యాసంస్థ గాని ప్రస్తుతం పని చేస్తున్న విద్యాసంస్థ గాని ఇచ్చినటువంటి అవకాశం వల్లనే ఈ అవార్డు కైవసం చేసుకున్నట్టు తెలియజేశారు ఈ సందర్భంగా విద్యాసంస్థల అధినేతలకు సహచరులకు అవార్డును అంకితం చేస్తున్నట్టు తెలియజేశారు.

12
105 views