మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు.
నంద్యాల (AIMA MEDIA): రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి సూచనలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు పట్టణ కేంద్రంలో మైనర్లు వాహనాలు నడపడం పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా 22మంది మైనర్లు చట్టవిరుద్ధంగా two వీలర్స్ వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి, ఒక్కొక్కరికి 5,000/- జరిమాన విధించడంతో పాటు వారిని తల్లిదండ్రులు, సంరక్షకులను స్టేషన్ వద్దకు పిలిపించి రహదారి భద్రత, మైనర్ల వాహన నడపడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు మరియు బాధ్యతగల పర్యవేక్షణ అవసరంపై అవగాహన కల్పించారు. అదనంగా, మైనర్లకు ట్రాఫిక్ నియమాలు మరియు సురక్షిత డ్రైవింగ్ పద్ధతులపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.