వికసిత్త భారత్ సాధనకు పునరాంకితమవుదాం
ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్🔥#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
వికసిత్త భారత్ సాధనకు పునరాంకితమవుదాం
ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్🔥
*“ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు – స్వదేశీ, స్వభాషా, స్వభూష”
*: ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనం అందరం ప్రోత్సహించి వికసిత్ భారత్ సాధనలో పునరంకితం అవుదాం
*: ఆం.ప్ర రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్
అనంతపురము, అక్టోబర్ 25:
*ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనం అందరం ప్రోత్సహించాలని, వికసిత్ భారత్ సాధనలో అందరం పునరంకితం అవుదామని ఆం.ప్ర రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.
*శనివారం ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనంతపురం (Central University of Andhra Pradesh)లో “ఆత్మనిర్భర్ భారత్” అంశంపై మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు విశిష్ట ఉపన్యాసం ఇచ్చారు. తన ప్రసంగంలో ఆయన “ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు స్వదేశీ, స్వభాషా మరియు స్వభూష” అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ మూడు అంశాల ప్రాధాన్యాన్ని వివరించిన ఆయన, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని, తల్లిభాషపై గర్వం కలిగి ఉండాలని, మన సంస్కృతి, వారసత్వాన్ని విలువైనదిగా భావించాలని సూచించారు.
*భారతదేశం చారిత్రాత్మకంగా స్వయం సమృద్ధి కలిగిన దేశమని, ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా నేడు నిలిచిందని ఆయన అన్నారు. అయితే, వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన తర్వాత మనం దిగుమతులపై ఆధారపడే పరిస్థితికి చేరామని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత భారత్ ప్రపంచంలోని మూడవ అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగుతుందని ఆయన అన్నారు.
*కోవిడ్ సమయంలో భారతదేశం తన అసలైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం భారత్ విఫలమవుతుందని భావించిన వేళ, మనం స్వయం ఆధారంగా మాస్కులు, టెస్ట్ కిట్లు, వ్యాక్సిన్ కూడా తయారు చేశామని, కోవిడ్ ముగిసే నాటికి మన దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించి, 100కు పైగా దేశాలకు – అందులో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంకి కూడా – వ్యాక్సిన్ పంపినట్లు గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారు “ఆత్మనిర్భర్ భారత్”ను కేవలం సిద్ధాంతంగా కాక, ఆచరణలో చూపించారని పేర్కొన్నారు.
*ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం “Ease of doing Business” నుండి “Speed of doing Business” దిశగా అడుగులు వేసిందని, విశాఖపట్నంలో గూగుల్ 15 బిలియన్ డాలర్లతో AI సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.*
*ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్.ఏ. కోరి మాట్లాడుతూ 2047 నాటికి భారత్‌ను పూర్తిగా స్వయం సమృద్ధి కలిగిన దేశంగా తీర్చిదిద్దడమే దేశ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన గారికి విశ్వవిద్యాలయ కొత్త క్యాంపస్ వర్చువల్ ప్రారంభోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. విద్యా మంత్రిత్వశాఖ డైరెక్టర్లు ప్రథమ దశ నిర్మాణం – అకడమిక్, హాస్టల్, పరిపాలనా భవనాల వేగవంతమైన పూర్తి కోసం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.*
*డీన్ మరియు రిజిస్ట్రార్ (ఇన్‌చార్జ్) ఆచార్య సి. షీలారెడ్డి మంత్రివర్యులకు, ఇతర ప్రముఖులకు స్వాగతం పలికారు. “ఆత్మనిర్భర్ భారత్” దేశాన్ని అభివృద్ధి భారత్‌గా మార్చే మార్గమని ఆమె అన్నారు.*
*కార్యక్రమం ముగింపులో డీన్ (విద్యార్థుల సంక్షేమం) ప్రొఫెసర్ జి. రాంరెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంత్రివర్యులు పేర్కొన్న మూడు స్తంభాలకు మరో స్తంభాన్ని జోడిస్తూ “స్వాభిమానమే ఆత్మనిర్భర్ భారత్‌కు నాలుగవ స్తంభం” అని అన్నారు. అనంతరం మంత్రి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నందలి డేటా సెంటర్ తదితర విభాగాలను సందర్శించారు.*
*అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ దేశమంతా స్వదేశీ నినాదం ఆత్మ నిర్భర్ భారత్ పై భారత ప్రధాని ఇక పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం కల్పించడానికి, అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దీని యొక్క ఆవశ్యకత పదేపదే మన భారత ప్రధాని తెలుపుతున్నారు. ఏ దేశమైన ప్రగతి సాధించాలంటే ఇతర దేశాల ఉత్పత్తులపై ఆధారపడకుండా స్వదేశీయంగా మనమే తయారు చేసుకున్న ఉత్పత్తులను, టెక్నాలజీ, ఆవిష్కరణలు ఉత్పత్తులు చేయగలిగితే మన స్వదేశీ అవసరాలు తీరడమే కాకుండా ఎగుమతులను కూడా మనం చేసే అవకాశం ఉంటుంది అన్నారు. తద్వారా దేశ సంపద పెరుగుతుంది, సుస్థిర ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుతో పాటు సంపద సృష్టి జరుగుతుంది. సంపద సృష్టి జరిగితే మౌలిక సదుపాయాల కల్పన, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు, పరిశ్రమలు వచ్చే అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగం లేని భారతావని సాధ్యమవుతుందనీ, పేదరికం నిర్మూలన జరుగుతుందని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు, సంస్కరణలు, నిర్ణయాల వల్ల దేశ అభివృద్ధి పథంలో నడుస్తోందనీ, ప్రపంచంలో 11 వ స్థానంలో ఆర్థికంగా ఉన్న మన దేశం కొన్ని సంవత్సరాలలోనే ఆర్థిక ప్రగతి సాధించి నాలుగో స్థానానికి చేరినదనీ, 2030 నాటికి మూడవ స్థానానికి, 2047 సంవత్సరానికి మొదటి లేదా రెండవ స్థానానికి చేరుకుంటామని అనేక విదేశీ సంస్థలు, ఏజెన్సీలు అంచనాలు వేస్తున్నాయి అని తెలిపారు. మన దేశం ముందుకు అభివృద్ధి పథంలో సాగుతోందనీ, ఉత్కృష్టమైన సంస్కృతి, ఘనమైన వారసత్వ సంపద కలిగిన మన భారతదేశంలోనే ఉత్పత్తుల తయారీ చేపట్టి దిగుమతుల స్థాయి నుండి మన ఉత్పత్తులను ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అని పేర్కొన్నారు. స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రచారము చేయడం వలన, అవగాహన కల్పించడం వలన వాటిని ప్రమోట్ చేయడం జరుగుతోందని ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టి స్టార్ట్ అప్ ఇండియా, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అలాగే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ద్వారా స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించి స్ధానికంగా ఉద్యోగ ఉపాధి కల్పించే దిశగా అనేక వినూత్న కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. మన గౌరవ ప్రధానమంత్రి స్థానిక ఉత్పత్తులను పెంచడం ద్వారా స్థానికంగా వస్తువులు తయారు చేసుకుని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఎగుమతుల ద్వారా సంపద సృష్టించే కార్యక్రమం జరుగుతుందనీ అన్నారు. అంతే కాకుండా స్వదేశీ నినాదంతో 111 లక్షల కోట్ల రూపాయలతో దేశంలోని మౌలిక సదుపాయాల కల్పనకు జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హై వే నిర్మాణాలు, విమానాశ్రయాలు, పోర్టులు నిర్మించడం జరుగుతోందన్నారు. స్వదేశీ టెక్నాలజీతో మనం హెలికాప్టర్లను, స్వదేశీ విమాన ఇంజన్ల తయారీ చేసుకోగలుగుతున్నాం, అంతే కాకుండా చందమామ దక్షిణ ధృవం చేరుకుని చరిత్ర సృష్టించామని, డిఫెన్స్ పరికరాల తయారీ చేసుకోగలుగుతున్నామని, అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందుతున్నాం, తద్వారా అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోంది అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా స్వదేశీ నినాదం ఎంతగానో స్వతంత్ర భారతావని సాధనకు ఒక ముఖ్య కారణమైందని, ఉత్కృష్టమైనటువంటి నిర్మాణాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. అలాంటి స్వదేశీ ఆత్మ నిర్భర్ భారత్ కు మనం అందరం పునరంకితమై విస్తృతంగా ప్రచారం చేసి స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించి స్వదేశీ వస్తువుల తయారీ చేయడంలో, దేశ ప్రగతిలో భాగస్వామ్యులు అవుదామని మంత్రి పిలుపునిచ్చారు.
#ఆత్మనిర్భర్ భారత్
#విదేశీఆధారితపరికరాలు కాదు
#దేశీయఉత్పత్తులు
#ప్రస్తుతరవాణా
#భద్రహోషణ
#దేశీయవృద్ది
#మనఇండియా
#హెల్త్ఇండియా
#VocalforLocal
#MakeInIndia
#AatmanirbharBharat