logo

మహానంది సన్నిధిలో జిల్లా ఎస్పీ దంపతులు.

నంద్యాల జిల్లా /మహానంది (AIMA MEDIA ): మహానంది సన్నిధిలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షరాన్ దంపతులు శనివారం సాయంత్రం పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన పూజ కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల కంటే ముందు ఎస్పీ దంపతులకు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తో పాటు ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎస్పీ దంపతులను దుశ్యాలువతో సత్కరించి స్వామివారి మెమొంటోల్లతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని నాగేశ్వర శర్మ, హనుమంతు శర్మ తదితరులు పాల్గొన్నారు.

20
1335 views