logo

జి.టి.పేట గ్రామంలో చొక్కాకు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నాగులు చవితి వేడుకలు

మెంటాడ:
శనివారం ఉదయం మెంటాడ మండలం జి.టి.పేట గ్రామంలో చొక్కాకు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి గుడి వద్ద నాగులు చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ముందుగా పుట్ట వద్ద పసుపు, కుంకుమలతో అలంకరించి, పుట్టలో పాలు, గుడ్లు సమర్పించి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ పెద్దలు గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా చొక్కాకు సన్యాసి నాయుడు – కొండమ్మ దంపతులు (అమ్మ స్వచ్చంద సంస్థ చైర్మన్), మాజీ వైస్ సర్పంచ్ చొక్కాకు సన్యాసి నాయుడు, చొక్కాకు ఉమా, చొక్కాకు సత్యం, సిరిపురపు నారాయణ మూర్తి, చొక్కాకు చిన్నం నాయుడు, చొక్కాకు చరణ్, చొక్కాకు చందు తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై నాగదేవత ఆశీస్సులు పొందారు.

41
5032 views