logo

దూసుకువస్తున్న మంతా తుఫాన్* అక్టోబర్ 26,27,28,29, తేదీల్లో చాలా కీలకమైన రోజులు*

తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** అక్టోబర్ 26**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

దూసుకువస్తున్న మంతా తుఫాన్*

*ఆంధ్రప్రదేశ్ కి తప్పని ముప్పు*

*ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం*

*ఆంధ్రప్రదేశ్ కి రెడ్ అలెర్ట్*

*అక్టోబర్ 26,27,28,29, తేదీల్లో చాలా కీలకమైన రోజులు*

*28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయం లో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా*

*ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ ఇదే*

*విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం,తీవ్రమైన వర్షాలు తెలంగాణ, హైదరాబాద్ భారీ వర్షాలు.*

*సముద్రం కోస్తాబాగాల్లో ఉన్నట్లు వంటి మత్యకారులను అప్రమత్తం చేయాలి ఎవ్వరు కూడా సముద్రవేటకి వెళ్ళారాదు*

*దిగువున వున్నా లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలి.కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి*

*బలమైన గాలులు గంటకు 70-100 కిలోమీటర్లు*

*ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కాలేజీ, 28,29 తేదీల్లో సెలవు ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచన*

*దూర ప్రయాణo చేసేవాళ్ళు చెప్పిన డేట్స్ లో ప్రయాణాలు ఆపుకోవాలి*

*మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన వర్షాలు చూస్తాం*
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది క్రమంగా బలపడి ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగాను సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకులు స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో 4 రోజుల పాటు రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు: అల్పపీడనం తుపానుగా బలపడతుండటంతో అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఈ అల్పపీడనం సోమవారం నాటికి తుపానుగా బలపడుతుందని, రేపు భారీ వర్షాలు, ఎల్లుండి అతిభారీ వర్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్ష సూచన ఉంటుందని మంత్రికి వివరించారు. అయితే తుపాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలెర్ట్ చేయాలని మంత్రి అనిత అధికారులకు సూచించారు. అలానే ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇంకా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని మంత్రి అనిత చెప్పారు.

క్షేత్రస్థాయిలో యంత్రాంగం మరింత అలెర్ట్‌గా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అలానే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం అందించాలని ఆదేశించారు. భారీవర్షాల దృష్ట్యా వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని మంత్రి చెప్పారు. ఏదైనా ఆపద వస్తే విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 18004250101 ఇచ్చారు.

153
11301 views