ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో మాత్రమే ప్రయాణించాలి సురక్షితమైన ప్రయాణం అని నూతనంగా స్వాగతాన్ని పలుకుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఖమ్మం జిల్లా స_త్తుపల్లి డిపోలో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది,
దీనిలో భాగంగా బస్సు డ్రైవర్లు మరియు కండక్టర్లు ప్రయాణికులను ఆత్మీయంగా పలకరిస్తూ, స్వాగతం పలుకుతున్నారు,
విమాన ప్రయాణంలో మాదిరిగానే బస్సు ఎక్కడికి వెళుతుంది,
ఎంత సమయం పడుతుంది వంటి వివరాలను అందిస్తున్నారు.
బస్సులో ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత పెరుగుతున్న గొ_డవలను తగ్గించడానికి,
ప్రయాణికులకు సురక్షితమైన,
సుఖవంతమైన,
ప్రశాంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడానికి ఆర్టీసీ ఎండీ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రయాణికులను ఆదరించమని,
ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించాలని సిబ్బంది కోరడం ఈ వినూత్న పద్ధతిలో కోరడం జరిగింది.