logo

ప్రభుత్వ మెడికల్ కళాశాలల అమ్మకాన్ని వ్యతిరేకించండి- కేతిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా ధర్మవరం. తాడిమర్రి.మండలాల్లో మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు మెడికల్ కళాశాల లను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా కేతిరెడ్డి ధర్మవరం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వార్డుల్లో ధర్మవరం పట్టణంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు వైయస్సార్ అనుబంధ సంస్థలు సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటు కోసం 8480 కోట్లు కేటాయించి ఏడు మెడికల్ కళాశాల లను పూర్తి చేసి మరో 10 కళాశాలలో 80% నుండి 90% వరకు పూర్తి చేయడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి.పేదలు మధ్యతరగతి ప్రజలు డాక్టర్లు చదవాలనే విద్యార్థుల ఆశలకు అడియాశలు చేస్తూ తమ సొంత లాభం కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అమ్మకానికి పెట్టిందని మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. వైయస్సార్సీపి కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి సంతకాల సేకరణ చేయాలని ఆ విధంగా కూటమిపాలకుల రాక్షస పాలన గురించి వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అమీర్ భాష. జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ లు జయరాం రెడ్డి. చాంద్ బాషా. ముస్లిం మైనార్టీ నియోజవర్గం అధ్యక్షులు PMZ సాదిక్. ఎన్ జాకీర్.షేక్ ఫయాజ్. వైయస్సార్సీపి నాయకులు ప్రభాకర్ రెడ్డి చిలిమి రామయ్య గడ్డం పుల్లయ్యప్ప పెద్దిరెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.



102
4959 views