Gold Rate: అమెరికాలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు....
అమెరికాలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలకు ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. రికార్డు స్థాయి 4,381 డాలర్ల నుండి పసిడి ధర 6.3 శాతం మేర తగ్గింది. ఒక్కరోజే ఔన్స్ బంగారం ధర 245 డాలర్లు పడిపోయి 4,111 డాలర్లకు చేరింది. 2013 తర్వాత ఇంత భారీగా బంగారం ధర తగ్గడం ఇదే తొలిసారి అని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. బంగారంతో పాటు వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది. ఔన్స్ వెండి ధర 7.5 శాతం పడిపోయింది. ఈరోజు స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్‌పై 3.84 శాతం తగ్గడంతో 48.55 డాలర్లకు చేరుకుంది. ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడమే...