logo

*69వ నందిగామ డివిజన్ స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభం — ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) లాంఛనంగా ప్రారంభించారు*

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అక్టోబర్23 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

జగ్గయ్యపేట మండలం చిలకలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ నందిగామ డివిజన్ స్థాయి స్కూల్ గేమ్స్ సెలక్షన్ పోటీలను శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు.
ఎమ్మెల్యే విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మరియు మానసిక స్థైర్యం పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. “తల్లికి వందనం” పథకం కింద ప్రతి పిల్లవాడు, పిల్లవాడు ప్రయోజనం పొందుతుండడం గత ప్రభుత్వంతో పోల్చితే ముఖ్యమంత్రి విద్య పట్ల ఆసక్తిని మరియు భవిష్యత్ తరాల పట్ల ఉన్న దృష్టికోణాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని అన్నారు. తరువాత ప్రారంభ క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహం గా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడా విభాగాధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

1
88 views