logo

*చందర్లపాడు గ్రామంలో దేవాలయ గోవుల దురవస్థ*

ఎన్టీఆర్ జిల్లా నందిగామ అక్టోబర్23 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామంలో దేవాలయాలకు చెందిన గోవుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామ పరిధిలో ఉన్న వివిధ దేవాలయాల గోవులకు ఎటువంటి పశు వైద్య సేవలు అందకపోవడం గ్రామ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
గ్రామ సాంప్రదాయం ప్రకారం, రైతు కుటుంబాలు దేవాలయా లకు గోవులను సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. పూజా కార్యక్రమాల సమయం లో ఈ గోవులను అమ్మవారికి అర్పిస్తారు. మిగిలిన కాలంలో ఇవి గ్రామ పరిధిలో సంచరిస్తూ ఉంటాయి. అయితే ఈ గోవులు ప్రమాదాలు ఎదుర్కొన్నా, అనారోగ్యానికి గురైనా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ పశువైద్యులు కూడా ఈ అంశంపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇటీవల గ్రామం లో ఒక లేగ దూడకు కరెంట్ షాక్ తగలడంతో దాని కాలు తీవ్రంగా గాయపడింది. ఆ దూడ రోజుకు సగం కిలోమీటరు నడవడానికే ఒకరోజు పడుతోంది. ఈ ఘటన గ్రామంలో పశు వైద్య సేవల కొరతను బహిర్గతం చేసింది.
గ్రామ ప్రజలు, దేవాలయ కమిటీలు కలిసి ఈ సమస్యపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి, శాశ్వత పరిష్కారం కోరుతున్నారు.

0
0 views