logo

అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు చేయడం కూటమి ప్రభుత్వా లక్ష్యం...

విశాఖపట్నం గాజువాక

అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది.అంతర్జాతీయ ప్రమాణాలతో అనేక సౌకర్యాలు కల్పిస్తామని, అవన్నీ వినియోగించుకుని ఉత్తమ క్రీడాకారులుగా రూపొందాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా డివిజినల్ స్థాయి ఆటల పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు పూర్వ విద్యార్థిగా పాఠశాల ప్రగతిని చూసి చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. పాఠశాలకి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనలో జీవీఎంసీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.ఆరు మండలాలకు సంబంధించిన 720 మంది క్రీడాకారులు 60 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.డివిజనల్ లెవెల్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తారు.క్రీడలు వలన మానసిక ఉల్లాసము వ్యక్తిత్వము క్రమశిక్షణ అలవాటవుతాయని తెలిపారు.75 వార్డ్ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి మాట్లాడుతూ క్రీడాకారుల ఒలింపిక్ స్థాయికి ఎదగడానికి పాఠశాల స్థాయి పోటీలు దోహదం చేస్తాయని తెలియజేశారు.కార్యక్రమంలో పులి రమణారెడ్డి,మంత్రి గోపి ,రెడ్డి నాగేశ్వరరావు, ముసలయ్య పాల్గొన్నారు.మండల విద్యాశాఖ అధికారి కే రమణ జి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాచకొండ శ్రీనివాస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రవి ,శ్రావణి,షమీం,రామచంద్ర నాయుడు,బానోజి ,తదితరులు పాల్గొన్నారు.వాలీబాల్,కోకో,కబడి ,చెస్,యోగ,బ్యాడ్మింటన్,అథ్లెటిక్స్ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

0
12 views