logo

తెలంగాణలో చెక్ పోస్టులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు*

*తెలంగాణలో చెక్ పోస్టులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు*


*కలం నిఘా :న్యూస్ ప్రతినిధి*


హైదరాబాద్:అక్టోబర్ 22
తెలంగాణలో రవాణాశాఖ చెక్‌పోస్టులు తొలగిస్తూ రవాణాశాఖ చెక్ పోస్టుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్ పోర్ట్ చెక్ పోస్ట్ లను తక్షణమే ఎత్తివేయాలని రవాణా శాఖ కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో చెక్కు పోస్టులు ఎత్తివేస్తూ జీవో జారీ చేశామన్నారు. చెక్‌పోస్టుల రద్దు చేస్తూ ప్రజల్లో అవగా హన కలిగించేందుకు.. ట్రాన్స్‌పరెంట్‌గా ఆన్‌లైన్‌లో జరగడానికి చెక్‌ పోస్టులను రద్దు చేస్తూ రెండు నెలల కిందట నిర్ణయం తీసుకొని.. ఈ రోజు పూర్తిగా మూసి వేస్తూ అమలు చేస్తున్నామన్నారు.

తెలంగాణలో ఈవీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత రూ. 577 కోట్ల టాక్స్ ప్రభుత్వం మినహాయించిందన్నారు. ఇవీ వెహికిల్ అమ్మకాల షేర్ నుంచి 0.03 నుంచి 1.13 షేర్ పెరిగిందన్నారు.
ఢిల్లీలో పొల్యూషన్‌లో ఉండే పరిస్థితి లేదని.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చామ న్నారు. గతవారం ఆంటీ కరప్షన్ బ్యూరో అధికారులు చెక్పోస్టులపై నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీగా అవినీతి బయటపడడం కొసమెరుపు.

0
0 views