logo

కోటవురట్లలో హిందూ మహాసమ్మేళనం

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కోటవురట్ల గ్రామంలో ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా డిసెంబర్ ఒకటవ తేదీన సుమారు 8,000 మంది హిందూ బంధువులతో మహా హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని కోటవురట్ల చత్రపతి శివాజీ హిందూ సేన అధ్యక్షుడు నక్క సత్యనారాయణ తిరుపారు. కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత కుమార్ వస్తున్నారని ఇది హిందువులు తమ శక్తిని నిరూపించుకునే మంచి అవకాశం అని అన్నారు. అలాగే డిసెంబర్ 14వ తేదీన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కోటవురట్ల ఎండిఓ ఆఫీస్ వద్ద పెద్దల సమక్షంలో ఆవిష్కరణ జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమానికి హిందూ బంధువులు హైందవ సోదరులు భారీగా తరలిరావాలని చత్రపతి శివాజీ హిందూ సేన అధ్యక్షుడు నక్క సత్యనారాయణ , ఉపాధ్యక్షులు వేగి శివాజీ ,కార్యదర్శి శ్రీ దరాల తేజ, సహకార దర్శి జవ్వాదిజలచంద్రారావు, కోశాధికారి ఆడారి రామ గోవింద్ మరియు కమిటీ సభ్యులు కోరారు.

40
3363 views
  
1 shares