logo

లోన్ చెక్కును నామినికి అందించిన యూనియన్ బ్యాంకు మేనేజర్ సంజీవ్ కుమార్.

( జగిత్యాల జిల్లా, కొడిమ్యాల స్పాట్ న్యూస్ ).
కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన చేని శారద స్ఫూర్తి ఎస్ హెచ్ జి నాచుపల్లి మహిళా గ్రూప్ లో సభ్యురాలుగా కొంతకాలంగా కొనసాగుతూ యూనియన్ బ్యాంక్ లో 166000/- రూపాయల లోన్ తీసుకొని క్రమం తప్పకుండా చెల్లెస్తూ ఇటీవల మృతి చెందడంతో నామినిగా ఉన్న చేని శారద భర్త ధర్మపురికి బుధవారం రోజున యూనియన్ బ్యాంక్ మేనేజర్ సంజీవ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన ఎస్ హెచ్ జి సురక్ష పథకం ద్వారా శారద చెల్లించవలసిన లోనును నిలిపివేస్తూ చెల్లించిన లోను 110000/- రూపాయల లోన్ నిలిపివేసి చెల్లించిన లోన్ 56000/-రూపాయలను నామిని అయిన శారద భర్త ధర్మపురికి చెక్కు రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సంజీవ్ కుమార్, గోల్డ్ అప్రైజర్ ముమ్మాడి స్వామి, ఏపీఎం ధ్యావ మల్లేశం, సిసి స్వరూప, ఏఓపి జమున, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

36
2856 views