మేడారం రోడ్ల అభివృద్ధికి రూ. 91 కోట్లు.. 4 లేన్లుగా రోడ్ల విస్తరణ
మేడారం మహాజాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. కోటి మందికి పైగా భక్తులు అమ్మలను దర్శించుకుంటారు.వచ్చే సంవత్సరం జరగబోయే మేడారం జాతరను పురస్కరించుకొని, భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వంటి పనులు నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఈక్రమంలో మేడారంలో రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.91 కోట్లకు పైగా నిధులను కేటాయించింది.ఈ మొత్తంతో.. ఆర్టీసీ బస్టాండ్ నుంచి జంపన్నవాగు మీదుగా స్థూపం వరకు ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. అలానే లోలెవల్ బ్రిడ్జిల స్థానంలో హైలెవల్ వంతెనలు నిర్మింబోతున్నారు. ఈ పనులన్నీ మరో రెండు నెలల్లో అనగా ఈ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.మేడారం మహాజాతర సందర్భంగా కేవలం 4 రోజుల్లోనే కోటి మందికి పైగా భక్తులు అమ్మలను దర్శించుకుంటారు. దీంతో మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్థూపం వరకు.. సుమారు 3 కిలోమీటర్ల వరకు రోడ్డు మీద భక్తుల రద్దీ వ