శ్రీశైలం మల్లన్న ధ్వజస్తంభం ఎదురుగా ఆకాశదీపం ప్రజ్వలన.
*ఆకాశ దీపం*
సాయంకాలానికి పాడ్యమి ఘడియలు రావడంతో ఆలయ ప్రాంగణంలోఆకాశదీపంవెలిగించబడిందికాగా కార్తికమాసంముగింపు వరకు కూడా ప్రతిరోజూఈ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది.ఆలయ ప్రధాన ధ్వజస్తంభానికి పై భాగమున ఈ ఆకాశదీపం నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ధ్వజస్తంభం వద్ద ఈ ఆకాశదీపం వెలిగించడం జరిగింది.కాగా ఈ సాయంత్రం ఈ ఆకాశదీప ప్రజ్వలనకు ముందుగా అర్చకస్వాములుసంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ జరిపించబడింది.అనంతరం దీపప్రజ్వలన, దీపారాధన జరిపించబడింది.ఈ ఆకాశదీపాన్ని వెలిగించినా, చూసినా సకల పాపాలు నశించి అనంతపుణ్యం కలుగుతుందని, వ్యాధులు తొలగి ఆయురారోగ్యాలు చేకురుతాయని చెప్పబడింది.