logo

పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం

దేశం, రాష్ట్ర, జిల్లా ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంను జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోగల 'స్మృతి వనం'లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బంది త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల భద్రత, శాంతి స్థాపన, నేర నియంత్రణలో పోలీసు శాఖ పోషిస్తున్న పాత్ర అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు. పోలీస్ శాఖ నిబద్ధత, క్రమశిక్షణ, ధైర్యసాహసానికి చిహ్నమని కలెక్టర్ అభివర్ణించారు. సమాజంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ప్రతి పౌరుడు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు రామసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎం.బబిత, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్లు ముఖ్య అథిదులుగా హాజరై, అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

0
93 views