logo

విహారం విషాదం కాకూడదు.. అధికారులకు ఎమ్మెల్యే కొండయ్య దిశానిర్దేశం..

బాపట్ల జిల్లా :

చీరాల అక్కడ బీచ్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం రానుండటంతో సముద్ర స్నానాలకు యాత్రికులు అధిక సంఖ్యలో రానున్నారు. కొద్ది రోజుల క్రితమే అక్కడ భద్రతా ఏర్పాట్ల లోపంతో ఒకే రోజు ఐదుగురు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. దీనితో ఎమ్మెల్యే కొండయ్య సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. రామపురంలోని ఓ ప్రైవేటు రిసార్ట్ లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. యువకులు గల్లంతైన ఘటన పై సీరియస్ అయిన ఆయన మెరైన్ పోలీసుల పై ఆయన ఫైర్ అయ్యారు. డ్యూటీ కూడా సరిగా చేయలేని మీకు జీతాలు ఇవ్వడం దండగని ఆయన మండి పడ్డారు. ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించేందుకు వాడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్య పాలెం బీచ్ లకు సందర్శకులు అధికంగా రానున్నారు. ఈ సందర్భంగా పరిష్టమైన భద్రతా ఏర్పాట్ల పై రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్ మరియు పోలీసు అధికారులకు ఎమ్మెల్యే కొండయ్య తగు సూచనలు చేశారు. మొదటగా సముద్ర స్నానాలకు అనువైన ఐదు ప్రాంతాలను పరిశీలించి అక్కడ మాత్రమే స్నానాలు ఆచరించేలా చర్యలు చేపట్టాలని రెవిన్యూ మరియు పోలీసు శాఖలను ఆదేశించారు. నిర్ధేశించిన ప్రాంతాలు దాటి లోతుకు వెళ్ళ కుండా సముద్రంలో బోట్ల పై సంచరిస్తూ పర్యవేక్షించే బాధ్యత ఫిషరీస్ కి అప్పగించారు. స్నానాలకు వచ్చిన యాత్రికులు అధికారుల సూచనలు పాఠిస్తూ జాగ్రత్తగా సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి క్షేమంగా వారి వారి గమ్య స్థానాలకు చేరాలని ఎమ్మెల్యే కొండయ్య కోరారు. పోలీస్ యంత్రాంగం స్నానాలు ఆచరించే వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ సముద్రంలో గస్తీ ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించి లైఫ్ జాకెట్లతో తగు చర్యలు చేపట్టాలని తెలిపారు.. ఎక్కడ ఎటువంటి అవాంచ్ఛనియ్య సంఘటనలు జరిగి ఎవరికి ఎటువంటి ప్రాణహాని కల్గినా ఉపేక్షించేది లేదని ఆయన అధికాలను హెచ్చరించారు.

24
1791 views