
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బూర్గంపాడు గ్రామపంచాయతీ కార్మికురాలు
తెలంగాణ స్టేట్*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* బూర్గంపాడు మండలం* అక్టోబర్ 20** (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
*రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బూర్గంపాడు మండల గ్రామపంచాయతీ కార్మికురాలు రోషమ్మ,
*హాస్పటల్ సందర్శించి పరామర్శించిన
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు,
మేజర్ గ్రామ పంచాయతీ సారపాక లో నిన్న(ఆదివారం) మధ్యాహ్నం 2:30 కు సారపాక సెంటర్లో గ్రామపంచాయతీ కార్మికురాలు రోషమ్మ కు యాక్సిడెంట్ అయ్యిందనీ వెంటనే క్షతగాత్రురాలను హుటాహుటిన భద్రాచలం విజయ్ కార్తీక్ హాస్పటల్ కు తరలించడం జరిగిందని వెంటనే వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారని అన్నారు. సోమవారం చికిత్స
పొందుతున్న కేసుపాక రోశమ్మ ను ,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, హాస్పటల్లో ఉన్న పంచాయితీ కార్మికురాలు రోషమ్మ ను ప్రమాదం ఏ విధంగా జరిగింది అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏజే రమేష్, మాట్లాడుతూ పంచాయతీ కార్మికురాలు రోశమ్మ సారపాక పంచాయతీలో 45 సంవత్సరాల నుండి పనిచేస్తుందని ఆమెకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆమెకు తల భాగంలో దెబ్బ కూడి భాగం కాలికి సర్జరీ అయిందని కుడి చేతికి దెబ్బలు తగిలాయని అన్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారితో సంప్రదించి రోషమ్మ కు అయ్యే ఖర్చును అతనితో పెట్టించాలని ఆమె ఆరోగ్యం కోలుకునేంతవరకు గ్రామపంచాయతీ నుంచి రోజువారి మస్టర్ ఎప్పుడు లాగానే ఇవ్వాలని పంచాయతీ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగిన పంచాయతీ నుంచి ఎటువంటి బినిఫిట్స్ లేవని రిటైర్మెంట్ అయినా కనీసం పింఛను కూడా లేదని వృద్ధాప్యంలో వారు బతకడానికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని అన్నారు . ఈ కార్యక్రమంలో రోశమ్మ కూతురు పద్మ పాల్గొన్నది