logo

గిరి ప్రగతికి కెరీర్ గైడెన్స్ -రాహుల్ సక్సెస్ మంత్రం -వాడవాడలా చాటింపు -రాష్ట్రస్థాయిలో గుర్తింపు -అన్నీ విద్యాసంస్థల్లో పాటింపూ

తెలంగాణ స్టేట్*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*
*భద్రాచలం ఐటీడీఏ న్యూస్* 19 అక్టోబర్ 25*
(ఏఐఎంఏ మీడియా న్యూస్ ప్రతినిధి)

*గిరిజన గైడ్ రాహుల్* ...!!

-గిరి ప్రగతికి కెరీర్ గైడెన్స్ -రాహుల్ సక్సెస్ మంత్రం ,
-వాడవాడలా చాటింపు -రాష్ట్రస్థాయిలో గుర్తింపు,
-అన్నీ విద్యాసంస్థల్లో పాటింపు
-కెరీర్ గైడెన్స్ పై పిఓ తాజా ఆదేశాలు

గిరి ప్రగతి ఆయన ప్రధాన ధ్యేయం.విద్యతోనే అది సాధ్యమని అపార నమ్మకం.అందుకే విద్య పైనే ప్రధాన దృష్టి.అడవి బిడ్డలు అందలమెక్కాలనేది లక్ష్యం.ఆ దిశగా అనుక్షణం అడుగులు.కెరీర్ గైడెన్స్ ఆయన సృష్టి.అది గిరిజన అభ్యున్నతికి మైలురాయి.గిరిజన సమగ్ర అభివృద్ధిని కోరుకునే ఆ యువ ఐఏఎస్ ఆఫీసర్ భద్రాచలం ఐటిడిఏ పిఓ బి.రాహుల్ ఐఏఎస్. నిత్యం అడవి బిడ్డల అభ్యున్నతి కోసం తహతహలాడే ఈ ఐఏఎస్ ఆలోచన రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తున్నదంటే ఆయన అద్భుత మాస్టర్ ప్లాన్ అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ప్రవేశ పెడుతున్న కెరీర్ గైడెన్స్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుగా చెప్పవచ్చు.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

*మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే దిశగా* ...

గిరి బిడ్డలు ఒకప్పుడు విద్యకు దూరంగా ఉండేవారు. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచేవారు. భద్రాచలం ఐటిడిఏ ఏర్పడిన తర్వాత గిరిజన విద్యకు పెద్దపీట వేయడంతో వేలాదిమంది గిరిజనులు అక్షరాస్యులుగా, ఉన్నత విద్యావంతులుగా మారారు. ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కూడా పొందుతున్నారు.అయితే ఇంకా పూర్తిస్థాయిలో గిరి బిడ్డలకు ఉన్నత విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే సదాశయంతో భద్రాచలం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న యువ ఐఏఎస్ ఆఫీసర్ బి.రాహుల్ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టిన విషయం విధితమే. అదే కెరీర్ గైడెన్స్. టెన్త్,ఇంటర్,డిగ్రీ పూర్తిచేసిన గిరిజన యువత ఉద్యోగ,ఉపాధి సౌకర్యాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న విషయం గమనించిన పిఓ రాహుల్ వారిని చైతన్యపరిచి, ఉన్నత శిఖరాల వైపు మళ్లించేందుకు కెరీర్ గైడెన్స్ ద్వారా వారికి విద్య, ఉపాధి, ఉద్యోగ ప్రగతికి దోహదపడుతున్నారు. ప్రతి గిరిజన పాఠశాల, కళాశాలల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి సమాచారం తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.ఆయా విద్యాసంస్థలలో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు వీటి ఆవశ్యకతను పిల్లలకు తెలియచేస్తున్నారు. ఇవి వారికి ఎంతగానో ఉపకరిస్తున్నాయి. వివిధ మండలాల్లో పనిచేస్తున్న తహసిల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, వివిధ శాఖల ఉద్యోగులు గిరిజన విద్యా సంస్థలను సందర్శించి పిల్లలకు కెరీర్ గైడెన్స్ పై మరింత అవగాహన కల్పిస్తున్నారు. తాము ఎలా చదువుకుంటే..? ఎలా ఉద్యోగం పొందామో స్వీయ అనుభవాలను పిల్లలకు తెలియచేస్తుండటంతో ఈ ప్రోగ్రాం పిల్లలను ఆలోచింపచేస్తూ, వారు లక్ష్యాలని ఎంపిక చేసుకునేలా దోహదపడుతోంది


*పిఓస్ఫూర్తితో మొదటిగా అన్ని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో అమలు* ...

భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అమలవుతున్న కెరీర్ గైడెన్స్ చక్కని ప్రోగ్రాం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గిరిజన సంక్షేమ పాఠశాలలో అమలవుతుండటం విశేషం. భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఐఏఎస్ ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రాం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులను కూడా ఆలోచింపజేసింది. గిరిజన సంక్షేమ శాఖ ఆనాటి స్పెషల్ సెక్రటరీ ఏ.శరత్ ఈ ప్రోగ్రామ్ పట్ల ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో ఈ తరహా కెరిర్ గైడెన్స్ కార్యక్రమమును అమలు చేయాలని ఉత్తర్వులు కూడా విడుదల చేయటం గమనార్హం. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో బి. రాహుల్ సేవలను స్పెషల్ సెక్రటరీ శరత్ ఎంతగానో ప్రశంసించారు. ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ద్వారా పెద్ద ఎత్తున యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలను పొందేలా దూసుకుపోతున్నారు.

*రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాలు ఇప్పుడు అన్ని PMSHRI విద్యాసంస్థల్లో అమలుకు రూ.1కోటి 42 లక్షల నిధులు వెచ్చింపు*

గిరిజన విద్యాసంస్థల్లోనే కాదు, అన్ని విద్యాసంస్థల్లో కూడా కెరీర్ గైడెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం విశేషం. ఐటిడిఏ పి.ఓ రాహుల్ ఆలోచన ప్రభుత్వం కూడా ఎంతగానో మెచ్చుకొని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటిలో కెరీర్ గైడెన్స్ కు శ్రీకారం చుట్టడం ముదావహం. 2025-26 సంవత్సరానికి 712 పీ.ఎం.ఎస్.హెచ్.ఆర్. పాఠశాలల్లో విద్యార్థుల కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ అమలు కోసం రాష్ట్రంలోని712పీ.ఎం.ఎస్.హెచ్.ఆర్.ఐ పాఠశాలలకు బడ్జెట్ విడుదల చేయడం జరిగింది. ఇందుకోసం రూ. 1,42,40,000 మంజూరు చేయటం కూడా చోటు చేసుకుంది. కెరీర్ ఫైనాన్స్, ఇండస్ట్రీ ఇంటర్ స్టూ ఇన్ లైన్ వనరులను నిర్వహించడం, అటువంటి కెరియర్ అసైన్మెంట్ జూల్స్, వర్చువల్ మెంటరింగ్ ప్రోగ్రాములను యాక్సెస్ చేయగలగడం కోసం, వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం, పాఠశాల క్యాంపస్ లో కెరీర్ ప్లెక్సీస్, పెయింటింగ్ లను ప్రదర్శించడం తదితర వాటిని చేపడతారు. ఇలా భద్రాచలం ఐటీడీఏ ద్వారా పురుడు పోసుకున్న కెరీర్ గైడెన్స్ తెలంగాణ రాష్ట్రం అన్ని విద్యాసంస్థలకు పాకి యువత అభ్యున్నతికి బీజం వేసే దిశగా మాస్టర్ ప్లాన్ తె ర పైకి తెచ్చిన భద్రాచలం ఐటిడిఏ పిఓ యువ ఐఏఎస్ ఆఫీసర్ బి.రాహుల్ కు జేజేలు చెప్పాల్సిందే.

*రాష్ట్ర విద్యాశాఖ సూచనలతో కెరీర్ గైడెన్స్ పై పిఓ తాజా ఆదేశాలు* ...

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలను అనుసరించి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామును ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి రాహుల్ ఐఏఎస్ సంబంధిత పాఠశాలల నిర్వహకులకు సూచించారు. నెలలో రెండవ, నాలుగవ శుక్రవారం ఆఖరి పిరియడ్లో స్థానిక డిపార్ట్మెంటల్ అధికారుల చేత అవగాహన తరగతులు నిర్వహించాలని కోరారు. సంబంధిత ఏ.టి.డి.ఓ లు, హెచ్.డబ్ల్యు.ఓ లు తగు పర్యవేక్షణ చేసి అంకిత భావంతో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ జరిగేలా, తద్వారా విద్యార్థిని విద్యార్థులు లబ్ధి పొందేలా చూడాలని ఆదేశిస్తూ పిఓ బి రాహుల్ ఉత్తర్వులు విడుదల చేశారు.

35
605 views