
నంద్యాల సమద్ కు ధార్మిక సేవా రత్న ప్రదానం చేసిన భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్.
నంద్యాల రిపోర్టర్/ మోహన్ (AIMA MEDIA): నంద్యాల జమాఆతె ఇస్లామీ హింద్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ కి భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి పర్వదిన సంధర్భాన జాతీయ లెజెండరీ పురస్కారాలు-2025 , "ధార్మిక సేవా రత్నా" ప్రదానం చేసారు. హైదరాబాద్, రవింద్రభారతిలో సంస్థ ఛైర్మన్ కళారత్న డా.బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ డి.మునిరత్నం నాయుడు, ప్రముఖక ఆధ్యాత్మిక వేత్త, రిటైర్డ్ ఇన్కంటాక్స్ ప్రిన్సిపాల్ చీఫ్ కమీషనర్ వై.నర్సింహప్ప,ఐఆర్ఎస్; కంఠమనేని శివశంకర్, రాజధాని ఫిల్మ్ చిత్రనిర్మాత, తెలుగువన్ వ్యవస్థాపకులు, వై ఎస్ ఆర్ శర్మ, ఆ.ఫ్రభ ఎడిటర్, డా.వాసిరెడ్డి మల్లేశ్వరి, గజల్ రచయిత్రి, డా.పి.విజయలక్ష్మి పండిట్ , డా.జల్ది విధ్యాదర్ ఐఆర్ఎస్ తదితరులు పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో సేవలు చేసిన ప్రముఖులను గుర్తించి పురస్కారాలు ప్రదానం చేసారు. సమద్ కి ఇప్పటికే ఎన్టిఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా ప్రశంసా పత్రం, మహాత్మా జ్యోతిరావు పూలె జీవితరత్నా సాఫల్య పురస్కారం , ఆంధ్రరత్నా, రాష్ట్ర ఉత్తమ పౌర సత్కారం, శ్రీ కృష్ణదేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారం, కరున సమయ సేవలకు పలు పురస్కారాలు పొంది ఉన్నారు. ముస్లిం రచయితల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తూ, పలు సాహితి సంస్థల పురస్కారాలు అందుకున్నారు. మూడు పుస్తకాలు ప్రచురించి ఇప్పటికి రచనా సాంగత్యం కొనసాగిస్తున్నారు. సమద్ కు రాష్ట్ర, జిల్లా మురసం నాయకులు ప్రముఖులు అభినందించారు.