logo

మొగదాలపాడు బీచ్‌లో యువకుడు గల్లంతు

శ్రీకాకుళం: పుట్టిన రోజు వేడుకల కోసం స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చిన యువకుడు గల్లంతైన ఘటన మొగదాలపాడులో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం కింతలి ఖాజీపేట గ్రామానికి చెందిన అలబాన జగదీష్‌కుమార్‌ విశాఖపట్నంలోని ఐటీఐ చదువుతున్నాడు. దీపావళి సెలవులకు ఇంటికి వచ్చిన జగదీష్‌కు ఆదివారం పుట్టిన రోజు కావడంతో మరో నలుగురి స్నేహితులతో కలిసి గార మండలం వత్సవలస పంచాయతీ మొగదాలపాడు వచ్చారు. సాయంత్రం బీచ్‌లో స్నానానికి దిగిన ఐదుగురు కేరింతల్లో ఉండగా భారీ అలకు జగదీష్‌ గల్లంతయ్యాడు. వెంటనే గాలించినా జాడ దొరకలేదు. మైరెన్‌ సీఐ బి.ప్రసాదరావు ఘటనా స్థలానికి వెళ్లి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్‌ స్నేహితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జగదీష్‌ తండ్రి గోవిందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు, గాలింపు చర్యలు చేపట్టామని ఏఎస్‌ఐ తెలుగు చంద్రశేఖర్‌ తెలిపారు.

4
85 views