logo

కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో కీలక మలుపు

తెలంగాణలో సంచలనం రేపిన నిజామాబాద్‌ సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో పోలీసులు కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ హత్యకు ప్రధాన నిందితుడైన షేక్‌ రియాజ్‌ను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు.
సారంగాపూర్‌ సమీపంలో రియాజ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు, అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హత్య జరిగిన 48 గంటల్లోపే నిందితుడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
పోలీసులు రియాజ్‌ వివరాలను సేకరించగా.. అతని నేర చరిత్ర చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడిన రియాజ్‌పై ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన రియాజ్‌.. యవ్వనంలోకి వచ్చినప్పటి నుంచి నేరజీవితాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

నగరంలో వాహన, గొలుసు దొంగతనాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న రియాజ్‌పై పోలీసులు నిఘా పెట్టారు. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ ఎదురయ్యాడు. అప్పుడు రియాజ్‌ కత్తితో దాడి చేసి ప్రమోద్‌ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానిక సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి, అతని కదలికలను ట్రాక్‌ చేసి, 48 గంటల్లోనే అతన్ని పట్టుకున్నారు. రియాజ్‌ అరెస్టుతో నిజామాబాద్‌ ప్రమోద్‌ హత్య కేసు కీలక మలుపు తిరిగింది.

0
0 views