logo

కేపీఎల్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. -ఫ్యాక్స్ చైర్మన్ మేనేని రాజనరసింగరావు.

కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కొడిమ్యాల మండల ఫాక్స్ చైర్మన్ మేనేని రాజనర్సింగరావు మాతృమూర్తి మేన్నేని ప్రేమలత గత కొద్ది రోజుల క్రితం మృతి చెందగా మాతృమూర్తులు మెన్నేని ప్రేమలత, మురళీధర్ రావుల స్మారకార్థం కొడిమ్యాల మండలములోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 01 వరకు జరిగిన క్రికెట్ ప్రీమియర్ లీగ్ 2లను నిర్వహించడం జరిగింది. ఈ టోర్ని లో మొదటి బహుమతి విజేతగా రాయల్ సూపర్ కింగ్స్ గోల్కొండ రాజు టీం 22,222/-రూపాయలు గెలుచుకోగా, రెండవ బహుమతి విజేతగా పిడుగు అనిల్ రెడ్డి టీం 11,111/-రూపాయలు
మూడవ బహుమతి విజేతగా బిఆరెస్ కేసీర్ గడ్డం లక్ష్మారెడ్డి టీం -5,555/-రూపాయలు, నాలుగవ బహుమతి విజేత ఛత్రపతి శివాజీ వారియర్స్ బండారి సురేష్ టీం -3333/-రూపాయలను గెలుచుకున్నారు. విజేత బహుమతితో పాటు, నగదు 50,000/- రూపాయలను సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగ రావు, చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందించారు.
ఇట్టి టోర్నమెంట్ లో 10 ప్రాంచైసీ టీమ్స్ పాల్గొన్నాయి.
ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ యువత క్రీడలు అడటం వలన శారీరక, మానసిక అభివృద్ధి, ఉద్యోగాలు సాధించొచ్చని అన్నారు. ఇట్టి బహుమతి ప్రధానోత్సవం లో నిర్వాహకులు క్రికెట్ క్లబ్ కొడిమ్యాల సభ్యులు ఎర్రోజు మోహనచారి, రాపర్తి లక్ష్మణ్, సామ సురేందర్ రెడ్డి, డేవిడ్ సన్, బావు రాకేష్, నేరెళ్ల మహేష్, చొక్కాల నాగార్జున, మొగిలి శేఖర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

66
3417 views