logo

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, జిల్లా కలెక్టర్.

నంద్యాల రిపోర్టర్/ మోహన్ (AIMA MEDIA ): వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో ఆనందంగా, సురక్షితంగా పండుగ జరుపుకోవాలని జిల్లా ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌ లు ఆదివారం ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు దీపావళి పండుగ పర్వదినాన్ని సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీపావళి చీకటిని తొలగించి వెలుగును పంచే పండుగగా, చెడుపై మేలుని గెలుపుని ప్రతిబింబించే సందర్భమని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, అభ్యుదయం నింపాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. పటాకుల వల్ల కలిగే అగ్ని ప్రమాదాలు, కాలుష్యాన్ని నివారించే దిశగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలని, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేలా మితమైన పద్ధతిలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ప్రజల హృదయాల్లో సానుకూల భావాలు, స్నేహభావం, ఐక్యత నింపి సామాజిక సమైక్యతను బలపరచాలని కోరారు.

5
104 views