logo

యుటిఎఫ్ నంద్యాల జిల్లా అద్వర్యం లో స్టడీ సిర్కిల్ నిర్వహణ.

నంద్యాల రిపోర్టర్/ మోహన్ (AIMA MEDIA ): నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.వి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన స్టడీ సర్కిల్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నుల విధానం భారతదేశంపై దాని ప్రభావం అనే అంశంపై మాట్లాడేందుకు బేతంచెర్ల ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ T. మరియాదాస్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. సామాన్య ప్రజలలో మరియు విద్యార్థుల్లో ట్రంప్ ఆలోచన విధానం భారతదేశ సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అందుకోసం భారత్ ఎలాంటి విధానాలను అనుసరించాలో కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేసినట్లు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.వి ప్రసాద్ తెలియజేశారు.ఇందులో భాగంగా ముఖ్య వక్త మరియ దాస్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా తృతీయ ప్రపంచ దేశాలను తన మాట వినేలాగా చేసుకోవడం కోసం భారతదేశంవంటి మిత్ర దేశాల పైన కూడా భారీ సుంకాల వేటుకు పూనుకున్నాడని దీనివలన భారతీయ ప్రముఖ రంగాలైనటువంటి వ్యవసాయం, వస్త్ర పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, చేనేత పరిశ్రమ , చిన్న మధ్య తరహా పరిశ్రమలు పై పెను ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలియజేశారు. ట్రంప్ అనుసరించిన విధానం వలన భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్లో అధిక ధరలు కలిగి డిమాండ్ కోల్పోయి ఉత్పత్తి సంస్థలు మూసివేతకు గురవుతాయని తద్వారా భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో అజమాయిషి చేయొచ్చనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారని తెలియజేశారు . ముఖ్యంగా అమెరికాలో అధికంగా ఉత్పత్తి చేయబడే పాలపొడి,బియ్యం, మొక్కజొన్న,మాంసం, మొదలైన వాటికి భారతదేశంను ఒక వినియోగదారుని మార్కెట్ గా పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు, భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులతో సంబంధం లేకుండా తమ దేశ వ్యవసాయ ఉత్పత్తులను భారతీయ మార్కెట్లో విక్రయించాలని ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ విధానం ఉందని తెలియజేశారు .అంతేకాక రష్యా నుండి భారత దేశం చమురును కొనుగోలు చేయడాన్ని నిలిపివేయాలని తాము చెప్పిన మాట వినకపోతే భారతీయ ఉత్పత్తులపై లేదా దిగుమతులపై అధిక పన్ను భారం మోపుతానని భారతదేశాన్ని బెదిరించే ధోరణిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన విధానాన్ని ప్రకటించి అమలుపరుస్తున్నారని తెలియజేశారు. ట్రంపు విధానంతో రాజీ పడడమా లేదా పోటీ పడడమా అనేది నిర్ణయించుకోవాలంటే అమెరికా వంటి ప్రపంచ దేశాల ఆంక్షలు వారి విధివిధానాలు భారతదేశాన్ని ఏమీ చేయలేవనే ధైర్యాన్ని ప్రజలకు భారత ప్రభుత్వం కల్పించాలని అందుకోసం ఒక సరికొత్త ఆర్థిక ప్రణాళికలను భారత ప్రభుత్వం రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని,దీనికోసం మేధావుల మేధస్సు సమీకరణ జరగాలని భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు భారతదేశ విదేశాంగ విధానం ఆర్థిక విధానం ఒక మాతృక కావాలని మరియదాసు గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో UTF జిల్లా కార్యదర్శులు రామకృష్ణుడు,నరసింహారెడ్డి,అరవింద్,నంద్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మల్లికార్జునప్ప ,సోమన్న..నాయకులు రామదాసు,బాలస్వామి,వెంకటేశ్వర్లు, రాం నాయక్ ,శేఖర్,శంకర్,వెంకటేశ్వర్లు,ఫిదా హుస్సేన్, చిన్నయ్య,రామకృష్ణ,మోహన్ ,రాజశేఖర్ పాల్గొన్నారు.

27
3777 views