logo

యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో ముందస్తు దీపావళి వేడుకలు.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో బ్యాంక్ లో ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ అందరికి ఈ దీపావళి నుండి అంత శుభమే జరగాలని కోరుతూ, బ్యాంక్ ఖాతాదారులకు, బ్యాంక్ సిబ్బందికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సిబ్బందికి స్వీట్ల పంపిణి చేశారు. ఇట్టి దీపావళి ముందస్తు వేడుకల్లో యూనియన్ బ్యాంక్ మేనేజర్ సంజీవ్ కుమార్, బ్యాంక్ సిబ్బంది, గోల్డ్ అప్రజర్ ముమ్మాడి స్వామి, ఖాతాదారులు, మహిళా సంఘాల సిఏ లు, సభ్యులు పాల్గొన్నారు.

36
2949 views