logo

గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్.

నంద్యాల జిల్లా /పాణ్యం (AIMA MEDIA ): పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు మరియు అధ్యాపకుల సహకారంతో గ్రంథాలయాన్ని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ చేతులమీదుగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎంఈఓ కోటయ్య మరియు ప్రిన్సిపాల్ శోభా రాణి పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ శోభా రాణి ఆధ్వర్యంలో లైబ్రరీ ఏర్పాటుకు విరాళాలుగా 500 పుస్తకాలు సుమారు 80 వేల రూపాయలు విలువ గల పుస్తకాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడం,జిఎస్టి కార్యక్రమల అవగాహన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,అధ్యాపకులు , జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పివి రామన్ , హై స్కూల్ హెడ్మాస్టర్ కె వెంకట రాములునాయక్, పి ఎస్ సి అండ్ కె వి ఎస్ సి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నంద్యాల కామర్స్ అధ్యాపకులు శ్రీ డా. వెంకటేశ్వర్లు, కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమం లో అధ్యాపక బృందము ఫారిదా మేడం, రమేష్ సార్, నరేష్ సార్, భాస్కర్, సార్, NSUI జిల్లా కార్యదర్శి, బత్తిని ప్రతాప్,, వేణు, రాజు, విగ్నేష్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

0
0 views