నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం
నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున ఫ్లైఓవర్ పై డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు, డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. మరో పది మందికి స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. అతి వేగం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.