గంగిరెద్దుల సన్నాయి డోలుతో వినూత్న బిసి బంద్ తెలిపిన మండల బిసి జెయేసి నాయకులు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల అన్ని గ్రామాలతో పాటు మండల కేంద్రంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీ లకు కావలసిన, రావాల్సిన హక్కులు, వాటాల కోసం బీసీ బందును రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు కొడిమ్యాల మండలములో అన్ని వర్గాల ప్రజలు, అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రవేటు, జెఎన్టియూహెచ్ విద్యా సంస్థలు, ఆఫీసులు, వాణిజ్య, వ్యాపార, రవాణా సంస్థలు అన్ని బంధు చేయడం జరిగింది. బందుకు సహకరించిన అందరికి, బంధు కార్యక్రమం లో తమ వంతు బాధ్యతను నిర్వర్తించిన బిసిలకు మండల బిసి జెయేసి నాయకుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
సామాజిక కార్యకర్త బీసీ నాయకులు బింగి మనోజ్ కుమార్, బిఆరెస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పులి వెంకటేష్ గౌడ్, నారాయణ గౌడ్, సురుగు శ్రీనివాస్, రాచకొండ చంద్రమోహన్, బోగ రాకేష్, బీసీ నాయకులు కునవేని రాజశేఖర్, నసీరుద్దీన్, లాగల రాజేశం, సరిపెల్లి రత్నాకర్, కొలకాని సత్యం, గాజుల అజయ్, కొత్తూరు స్వామి, సాయి, కళ్యాణ్, నిఖిల్, కార్తీక్, సంతోష్, సలాఉద్దిన్, మహేందర్, హరిందర్, పర్శరాములు, రవి, స్వామి, కర్ణాచారి, మొగిలి రాకేష్, సన్నీ, కాయిత రాజు, శ్రీను, రాజు, గుర్రం నర్సయ్య, రవి, నాంపల్లి రాజేశం తదితరులు తో పాటు అన్ని కుల సంఘాల సభ్యులు బంధులో పాల్గొన్నారు.