logo

అచ్చంపేట లో బీ సీ లకు 42శాతం రిజర్వేషన్ల సాధన కొరకు చేసిన బంద్ కార్య క్రమం విజయవంతం

అచ్చంపేట లో బీ సీ లకు 42శాతం రిజర్వేషన్ల సాధన కొరకు చేసిన బంద్ కార్య క్రమం విజయవంతం



అచ్చంపేట, అక్టోబర్18:తెలంగాణరాష్ట్రం లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు జారీ చేసిన స్టేకు నిరసనగా బీసీజేఏసీపిలుపుతో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అమ్రాబాద్ శనివారం నిర్వహించిన బంద్‌కు అచ్చంపేట నియోజకవర్గంలో విస్తృత స్పందన లభించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే అచ్చంపేట బస్ డిపో ఎదుట కాంగ్రెస్, సీపీఐ, బీసీ జేఏసీ, ఏఐఎస్ఎఫ్ తదితర సంఘాల నాయకులు ధర్నాకు దిగారు.

పలు విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను అడ్డుకుంటూ నిరసనలు తెలిపారు. సిపిఐ అచ్చంపేట నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బల్ముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌తో పాటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు బంద్‌కు మద్దతు తెలపడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలలు సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర మద్దతు తెలిపినట్టు సమాచారం.
అమ్రాబాద్‌లో రాస్తారోకో
కొత్త బస్టాండ్ సమీపంలో నిరసన కార్యక్రమం
అమ్రాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాస్తారోకో చేపట్టారు. కొత్త బస్టాండ్ సమీపంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక మండల నాయకులు, వివిధ కుల, రాజకీయ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు. బీసీల హక్కుల కోసం ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. బీసీ ల హక్కుల సాధన కోసం నిర్వహించిన అఖిలపక్ష పోరాటం లో ఈ బంద్ ఆరంభం మాత్రమేనని భవిష్యత్తు లో పెద్ద ఎత్తున ఉద్యమం ఆందోళన కార్యక్రమాలు అన్నీ రాజకీయ పార్టీ లు, అన్నీ కుల సంఘాల మద్దతు తో ఉవ్వెత్తున కార్యక్రమాలు చేపడతామని నేతలు స్పష్టం చేశారు. _*బీసీ జేఏసీ బంద్‌కు అచ్చంపేట శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణ పూర్తి మద్దతు..*_

_అచ్చంపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు అక్టోబర్ 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ బంద్‌లో పాల్గొన్న.._

_*తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు అచ్చంపేట శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణ

మాట్లాడుతూ..*


తెలంగాణ ప్రజా ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుంటే కొన్ని పార్టీలు కపట ప్రేమ చూపిస్తున్నాయని రాష్ట్రంలో సై అని ఢిల్లీలో నై అంటున్న ఇరువరుగు పార్టీలు.._

_• రాజకీయా ఎన్నికల వరకు రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఎంతో ఉంది.._

రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం కామారెడ్డి బిసి డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం #సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనలేని కృషి చేస్తున్నారు..*

_• బీసీ రిజర్వేషన్ 42% సహకరించకుంటే రేపు గ్రామాల్లో బీసీల ఓట్లు ఎలా అడుగుతారని హెచ్చరించారు.._

_• బీసీ బందుతో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి లేకుంటే *తెలంగాణలో బిజెపి* కనుమరుగైపోతుంది.._

_• జస్టిస్ పేరుతో బీసీ సమాజం హక్కుల కోసం, సామాజిక న్యాయం సాధన కోసం చేస్తున్న ఈ బంద్ చారిత్రాత్మక పోరాటం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకట్ట వేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే.._

_• బీజేపీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు, దేశం మొత్తానికీ బహిర్గతమైంది. ప్రజల హక్కులను అడ్డుకోవడం, సామాజిక న్యాయాన్ని నిరాకరించడం వారి అలవాటు. అందుకే ఈ బంద్ కేవలం బీసీల కోసం మాత్రమే కాదు న్యాయం, సమానత్వం కోసం ప్రతి పౌరుడు ముందుకొచ్చారన్నారు.._

_• తక్షణమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లును పాస్ చేయాలని లేకుంటే బీసీలకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేశారు.._

_• రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఖిలపక్ష ప్రతినిధులు రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలవాలని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా, కేంద్ర ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదు. ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రజల హక్కుల కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు అని విమర్శించారు.._

_ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

అదే విధంగా
*బీసీల రిజర్వేషన్లు రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి*
*అఖిలపక్ష పార్టీలు చేసిన నాయకులు కేంద్రంపై యుద్ధం చేయాలి*
*ఎం శంకర్ నాయక్* సిపిఎం మండల కార్యదర్శి
బల్మూరు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతూ తీర్మానం చేసి గవర్నర్ ఆర్డినెన్స్ బిల్లు పాస్ చేయాలని పంపితే చార్జ్ చేయకుండా కాలయాపనం చేస్తున్న తీరును నిరసిస్తూ బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బందు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో సిపిఎం సంపూర్ణ మద్దతుప్రకటించారు.
మండల కేంద్రంలో ఉన్న స్కూల్స్ వ్యాపార దుకాణాలు బంద్ చేయించి రోడ్డుపైన నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖదీర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు శివశంకర్, తిరుపతయ్య బీసీ సంఘం నాయకులు శంకర్ సుధాకర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. బీసీలు రాజకీయంగా విద్యా ఉద్యోగ పరంగా స్వతంత్ర కాలం నుంచి ఇప్పటివరకు ఇంకా వెనుకబడి ఉన్నారని వారి జనాభా ఎంతో రిజర్వేషన్ కల్పిస్తే తప్ప అభివృద్ధికి నోచుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ గారు ఆమోదం తెలిపి అన్ని రంగాల్లో బీసీలకు న్యాయం జరిగే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని దీనికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. బీసీలకు అన్యాయం చేసే రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవని ఆ పార్టీల భరతం పడతామని వారిని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని టిఆర్ఎస్ నాయకులు అన్నారు.
బీసీలకు ఉద్యోగ ఉపాధి రాజకీయపరంగా అన్ని అవకాశాలు దక్కాలంటే రిజర్వేషన్లు తక్షణమే అమలు కావాలని రిజర్వేషన్ అమలుకు సూత్రబద్ధంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో చట్టం చేయాలని పార్లమెంటు జోక్యం చేసుకోకపోతే బీసీల రిజర్వేషన్లు పెరగవని బిజెపి ప్రభుత్వం మోడీ బీసీల పక్షాన ఆలోచించాలని ఇక్కడున్న కేంద్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు బిజెపి పార్టీ పై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యచరణ ఉండాలని కోరారు. లేనిచో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అఖిలపక్ష పార్టీలను సమావేశ నిర్వహించి ఢిల్లీపై యుద్ధం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శంకర్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు ఎండి లాల్ మమ్మద్ బాబర్ ఆంజనేయులు మాసయ్య కృష్ణయ్య భారీ టిఆర్ఎస్ నాయకులు తిరుపతయ్య కాంగ్రెస్ నాయకులు ఖదీర్ వెంకటయ్య కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

16
494 views