logo

తెలంగాణ బీసీ బంద్‌కి అచ్చంపేట, అమ్రాబాద్‌లో విశేష స్పందన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఆందోళనలు

తెలంగాణ బీసీ బంద్‌కి అచ్చంపేట, అమ్రాబాద్‌లో విశేష స్పందన

42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఆందోళనలు

అచ్చంపేట, అక్టోబర్ 18 :
తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు జారీ చేసిన స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపుతో శనివారం నిర్వహించిన బంద్‌కు అచ్చంపేట నియోజకవర్గంలో విస్తృత స్పందన లభించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే అచ్చంపేట బస్ డిపో ఎదుట కాంగ్రెస్, సీపీఐ, బీసీ జేఏసీ, ఏఐఎస్ఎఫ్ తదితర సంఘాల నాయకులు ధర్నాకు దిగారు.

పలు విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను అడ్డుకుంటూ నిరసనలు తెలిపారు. సిపిఐ అచ్చంపేట నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలుమల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌తో పాటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు బంద్‌కు మద్దతు తెలపడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలలు సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర మద్దతు తెలిపినట్టు సమాచారం.


---

అమ్రాబాద్‌లో రాస్తారోకో

కొత్త బస్టాండ్ సమీపంలో నిరసన కార్యక్రమం

అమ్రాబాద్, అక్టోబర్ 18:
అమ్రాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాస్తారోకో చేపట్టారు. కొత్త బస్టాండ్ సమీపంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక మండల నాయకులు, వివిధ కుల, రాజకీయ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు. బీసీల హక్కుల కోసం ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. బీసీల హక్కుల సాధన కొరకు శనివారం రోజు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బిసి బందు కార్యక్రమం ఆరంభం మాత్రమేనని ఇకనుంచి బిసి విద్యార్థి సంఘాలు అన్ని కుల సంఘాలతో అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసిపోయి ఐక్య కార్యాచరణ ఉద్యమ కార్యక్రమాలను ఉదృతం చేస్తామని బీసీల నేతలు తెలిపారు.

7
268 views