logo

కడప-రాయచోటి-మదనపల్లె-బెంగుళూరు రైల్వే లైన్ కు నిధులు మంజూరు చేయాలి*

రాయలసీమ ప్రాంత ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు( పిపిపి)పరం చేసే ప్రయత్నాలను తక్షణం విరమించుకోవాలి*

*ప్రజా సమస్యలపై రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్ళి ఒత్తిడి తేవాలి*

*కర్నూలు బహిరంగ సభలో ప్రధాన మంత్రి రాయలసీమ సమస్యలపై, అభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలి*

*రాయచోటి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యులు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి డిమాండ్*

రాయచోటి, అన్నమయ్య జిల్లా (15-10-2025):- రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప నుంచి వయా రాయచోటి,మదనపల్లెల మీదుగా బెంగుళూరు రైల్వే లైన్ కు నిధులు మంజూరు చేసి కరువు కాటకాలతో అల్లాడుతున్న రాజకీయ నిర్లక్ష్యానికి గురియైన రాయలసీమ అభివృద్ధికి దోహద పడాలని రాయచోటి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యులు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి బుధవారం ఒక పత్రిక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.రాయలసీమ ప్రాంతంలోని ఆదోని ,మదనపల్లె, మార్కాపురం ప్రభుత్వ వైద్య కళాశాలను జివో ఆర్టీ నెంబర్ 590 ద్వారా ప్రైవేటు( పిపిపి)పరం చేసే ప్రయత్నాలను తక్షణం విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్ళి ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం 16 న కర్నూలులో జరిగే బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాయలసీమ సమస్యలపై, అభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు తీరని ద్రోహం చేశారని, రాయలసీమకు నవ మోసాలు చేశారని ఏర్పడిన ఆరోపణలు నిజం కాదని చెప్పడానికి కనీసం కర్నూలు బహిరంగ సభలోనైనా రాయలసీమ సమస్యలపై వారు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని, హైకోర్టులో ఒకదానిని సీమలో ఏర్పాటు చేయాలని, కానీ మోడీ, చంద్రబాబు పాలనలో ఆ రెండింటిలో ఒకటి కూడా సీమలో ఏర్పాటు చేయకుండా రాయలసీమకు తీరని, శాశ్వత అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంతో పాటు రాయలసీమకు ప్రత్యేకహోదా సంజీవని లాంటిదని, అది హక్కు అని, భిక్ష కాదు అని అయినప్పటికీ 11 సంవత్సరా లుగా ప్రత్యేక హోదా అమలకు నోచుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సటీ సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమ, ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వం బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు ఇవ్వాలని కోరారు.ఆ నిధులు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేసిందని ,ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13 షెడ్యూల్లో కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్ చేశారు. 11 సంవత్సరాలకు పైన అతి గతి లేదని, విభజన చట్టం 18వ షెడ్యూల్ ప్రకారం దుగరాజపట్నంలో మేజర్ ఓడరేవు కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని,11 సంవత్సరాలైనా ఆ ఊసే లేదని ఆందోళన వ్యక్తం చేశారు.రాయలసీమ సమగ్రా భివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2008 సంవత్సరంలో కడప, రాయచోటి, మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని మంజూరు చేసి కొంత వరకు పూర్తి చేసిందని. మోడీ ప్రభుత్వం ఆ రైలు మార్గాన్ని రద్దు చేసిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయలసీమలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించేందుకు శ్రీ కాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టును గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని,మోడీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందని తెలిపారు. కృష్ణానది యాజమాన్యబోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో కాకుండా విజయవాడలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాయడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు హంద్రీ -నీవా,ఝరికోన ప్రాజెక్టు సాగు నీటి కాలువలు,తెలుగుగంగ, గాలేరు-నగిరి, వెలుగొండ లాంటి ప్రాజెక్టులు నిధులు లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయని తెలిపారు.రాయలసీమ అభివృద్ధి కాంక్షించే పార్టీలు అధికారంలోకి వచ్చి ఉంటే పై సమస్యలన్నీ ఎప్పుడో పరిష్కారం అయి ఉండేవని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈనెల 16వ తేదీన రాయలసీమ లోని కర్నూలులో భారీ బహిరంగ సభ నిర్వహించే నైతిక హక్కు ప్రధానమంత్రి మోడీకి గానీ,ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గాని ఉందని నిరూపించుకోవాలని విశ్వనాథరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీ మ పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే 16వ తేదీ బహిరంగ సభలో పై అంశాలపై ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుస్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

12
231 views