
బీసీ బంద్‌కి అచ్చంపేటలో ప్రజా సంఘాల విశేష మద్దతు
బీసీ బంద్‌కి అచ్చంపేటలో ప్రజా సంఘాల విశేష మద్దతు
అచ్చంపేట,అక్టోబర్ 17,బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న జరగనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని అచ్చంపేట బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు సాదే రాజు పిలుపునిచ్చారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరముందని, ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ బంద్ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
అచ్చంపేటలో బంద్‌ను సమర్థిస్తూ స్థానిక ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గంగాపురం రాజేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోకల మనోహర్, బీజేపీ నాయకుడు మొక్తాల రేణయ్య తదితరులు బీసీ జేఏసీ నాయకులతో కలిసి మద్దతు తెలిపారు. విద్యాసంస్థలు, కళాశాలలతో పాటు వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల నుంచి బంద్‌కు పూర్తి మద్దతు లభించిందని బీసీ జేఏసీ అధ్యక్షుడు మండికారి బాలాజీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కాశన్న యాదవ్, కోశాధికారి అనిల్, కన్వీనర్లు బీసం ఆంజనేయులు, ఎలిమినేటి వెంకటేష్, వగ్గు శరన్ గౌడ్, కిట్టు పటేల్, డా. యుఎల్ చారి, తొంబర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అత్యవసర అవసరాల మినహా ప్రజలు ప్రయాణాలు, కార్యక్రమాలను నివారించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
బీసీ జేఏసీ బంద్‌కు నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు
42 శాతం బీసీ హక్కుల సాధన కోసం జరగనున్న బంద్‌కు నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని అచ్చంపేట,ఎమ్మేల్యే,టీ పీ సీసీ ఉపాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, డా. చిక్కుడు వంశీకృష్ణ ఈ మేరకు ప్రకటన చేశారు.తెలంగాణ రాష్ట్రం లో బీ సీ లహక్కుల లో బాగంగా
“42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు,” అని వంశీకృష్ణ తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు బంద్ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీసీల కోసం ఈ ఉద్యమంలో భాగమవుతుండటం విశేషమన్నారు.
బీజేపీ బీసీల హక్కుల విషయంలో నాటకాలు ఆడుతుందని ఆయన విమర్శించారు. “బీజేపీ ఎంత మాటలు చెప్పినా, బీసీల హృదయాల్లో స్థానం సంపాదించలేరు,” అన్నారు.