గవర్నర్ అబ్దుల్ నజీర్ నాగార్జునసాగర్ పర్యటనకు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ నెల 18, 19 తేదీలలో కుటుంబ సమేతంగా నాగార్జునసాగర్ ను సందర్శించనున్నారు.
18న విజయ్ విహార్ లో బస చేసి, 19న నాగార్జున కొండలోని బౌద్ధ స్తూపాలు, విజయపురి సౌత్ లాంచ్ స్టేషన్, అనుపు ప్రాంతాలను, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించనున్నారు. ఆయన పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.