logo

సాక్షి కార్యాలయం పై దాడులకు నిరసనగా ధర్నా 17 అక్టోబర్ ( బాన్సువాడ )


కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం బాన్సువాడ ప్రెస్ క్లబ్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సాక్షి పై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని వాస్తవాలు రాస్తున్న పత్రిక గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. సాక్షి ఎడిటర్ తో సహా జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు మరియు అధ్యక్షులు సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, వివిధ పార్టీ నాయకులు నాయకులు ప్రజాసంఘాల నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

16
1632 views