logo

బీసీల తెలంగాణ బంద్ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన ఎమ్మేల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ

బీసీల తెలంగాణ బంద్ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన ఎమ్మేల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ

అచ్చంపేట, అక్టోబర్ 15,:
తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన జరగబోయే రాష్ట్ర బంద్‌ పోస్టర్‌ను అచ్చంపేట పట్టణంలోని లింగాల చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద గురు వారం స్ధానిక ఎమ్మేల్యే డాక్టర్ చిక్కుడు.వంశీ కృష్ణ చేతుల మీదుగా బీ సి నేతలు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ గౌరవాధ్యక్షులు సాదే రాజు, చైర్మన్ మండిగారి బాలాజీ, కో కన్వీనర్లుగా బీసం. ఆంజనేయులు, రమేష్, యాదగిరి, రంగినేని రవీందర్, వెంకటేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ — బీసీ ల బిడ్డల భవ్యత్తు కొరకు
"బీసీల హక్కుల సాధనకై, రాజకీయాలకు అతీతంగా అన్ని బీసీ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ, కార్మిక, న్యాయవాదుల సంఘాలు ఏకతాటిపైకి రావాలన్నారు రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని బీ సి నేతలు పిలుపుచ్చా రు. ఉదయం 6 గంటల నుండి పట్టణంలోని విద్యా, వ్యాపార, రవాణా వ్యవస్థలు బంద్‌లో పాల్గొనాలని వారు కోరా రు."

కాంగ్రెస్ పార్టీ మద్దతు: వంశీకృష్ణ

ఈ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
"రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ కోసం కులగణన జరిపి చట్టసభల్లో చట్టాలు, జీవోలు రూపొందించి కేంద్రానికి పంపినా అవి ఆమోదం పొందకపోవడం బాధాకరం. బీసీలు రావాల్సిన వాటాను తప్పకుండా అందించాలన్నది కాంగ్రెస్ వైఖరి. బీసీలకు 42% రిజర్వేషన్‌కు మద్దతుగా కాంగ్రెస్ నిలుస్తుందని తెలిపారు."

బీఆర్ఎస్ తరఫున మద్దతు: మనోహర్

బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత మనోహర్ మాట్లాడుతూ —
"తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే రజాకారుల రోజులు గుర్తొస్తున్నాయి. బీసీలకు రావాల్సిన వాటా ప్రభుత్వం తక్షణం ఇవ్వాలి. పార్టీ తరఫున బీసీ బంద్‌కు మద్దతు ఉంటుంది" అని తెలిపారు.

బీజేపీ పూర్తిస్థాయి మద్దతు: రేనయ్య

తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రేనయ్య మాట్లాడుతూ —
"గత 70 ఏళ్లుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల లేకపోవడం వల్ల వెనుకబడిపోతున్నారు. బీసీలకు రావలసిన వాటా ఇప్పించాలని డిమాండ్ చేస్తూ, బీసీ బంద్‌కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తోంది" అని చెప్పారు.



18 తేదీ బీసీ బంద్ విజయవంతం చేయండి – బీసీ జేఏసీ పిలుపు

బీసీ జేఏసీ నాయకత్వంలో పిలుపునిచ్చిన ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీల నుండి మద్దతు లభించడం విశేషం. అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేయాలని నాయకులు కోరుతున్నారు.

19
59 views